Bible Truths (Telugu)

దేవుడు
పరిశుద్ధ గ్రంథము మనకు దేవుడు విశ్వసృష్టికర్తయైయున్నడని బోదించుచున్నది (ఆది:1:1). సృష్టి కర్తగా, ఆయన సృష్టిమనకు సంబంధి కాదు, వేరే మాటలో చెప్పాలి అంటే, ఆయన సృజింపబడిన వాడు కాదు. ఆయన నిత్యత్వము కలిగి ఆది అంతము లేనివాడు. ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు (నిర్గ. 15:18; ద్వితియో 33:27). పరిశుద్ధ గ్రంథ లేఖనము ప్రకారము ఆయన ఆత్మయైయున్నాడు (యోహాను 4:24). ఇప్పటి వరకు ఆయనను ఎవరు చూడలేదు మరియు ఎవరునూ చూడలేరు. దేవుడు ఆత్మ మరియు అదృశ్య స్వరూపి  (కొలొస్సి 1:15; 1తిమోతి 1:17). దేవుడు సర్వవ్యాపి (కీర్తన 139:7-10), సర్వశక్తిమంతుడు (మత్తయి 19:26), సర్వఙ్ఞాని మరియు సర్వవివేచన కలిగిన వాడు (లూకా 12:2).
దేవుడు ఒక్కడే. దానియొక్క అర్థము యెదనగా వేరుపర్చలేని, రెండవదిగా వేరొక్క దేవుడు లేడు. దేవుడు అనువాడు ఒక్కడే (ద్వితియో 4:35). దేవుడు జీవమునిచ్చువాడు (యోబు 33:4). ఆయన తీర్పుతీర్చువాడు మరియు లోకమును పరిపాలించువాడు (కీర్తన 10:26), కడవరి దినమున మనుష్యులకు వారి మాట్లనుబట్టి, వారి ఆలోచనలను బట్టి తీర్పుతీర్చువాడు, దీనినే తీర్పు దినమందురు (1పేతురు 3:7).
ప్రతివాడు, ప్రతిచోట దైవభయము, పాపమునుండి మారుమనస్సు కలిగి, విధేయతతో కూడిన విశ్వాసము కలిగి ఉండవలెనని పరిశుద్ధగ్రంథము ఆజ్యాపిచు చున్నది (ప్రసంగి 12:13; అపో.కా. 17:30).
దేవుడు మన తండ్రియై ఉన్నాడని పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది (మత్తయి 6:9; అపో.కా. 17:29). ఆయన మనలను తన నిత్య ప్రేమతో ప్రేమించుచున్నాడు  (యిర్మియా 31:3). కాబట్టి మనము పాపములలో నశింపోవలెనని ఆయన కోరువాడు కాదు [మన చెడ్డ ఆలోచనలు, పనులు అపరాధితపూరితమైనవి. అయితే దేవుడు మన కొరకు రక్షణ మార్గమును సిద్ధపాటు చేసెను. ఆయనే మన పక్షమున శిక్షను భరించి, మన నిమిత్తము బాధను అనుభవించెను. ఆయన మానవ అవతారిగా అవతరించినపుడు సిలువలో నిత్యబలియాగముగా మూల్యమును మన నిమిత్తము చెల్లించెను. కాబట్టి దేవుడు మాత్రమే మన రక్షకుడై ఉన్నాడు (యూదా 1:25)]. ఎవరైతే తమ హృదయము నందు ఈ సత్యదేవునిని ప్రార్థించెదరో వారి ప్రార్థన వెంటనే ఆయన ద్వారా అంగీకరించబడును, ఎందుకంటే దేవుడు అంతటను మరియు మన శ్వాసను మించిన దగ్గరలో ఉన్నాడు (కీర్తన 34:17; 130:1). "నేను పాపము చేసితిని ప్రభువా, నన్ను క్షమించుము" అని ఎవరైతే చెప్పుదురో దేవుడు వానిని క్షమించును. వాని పాపములు తొలగించబడును. తూర్పు-పడమర ఎలా వేరుగా ఉన్నాయో వాని పాపము ఆ విధముగా వేరుచేయబడును (వేరే మాటలో పూర్తిగా తుడెచివేయబడును (కీర్తన 103:2)), యేసు క్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఈ యొక్క క్షమాపణ మరియు నూతన జీవితం మనకు ఆనుగ్రహించబడినది [ఆయన దేవుని వాక్య-స్వరూపియై 2000 సంవత్సరముల క్రితము మానవ అవతారిగా అవతరించెను]. ఈయనే మన పాత లోక పాపమునకును, మరణమునకును ముగింపు. ఆయన మరణము, మూడవ దిన పునరుర్థానము వలన నూతన జీవము కలిగెను.

యేసుక్రీస్తు

యేసుక్రీస్తు దైవకుమారుడై ఉన్నాడని పరిశుద్ధగ్రంథము తెలియచేయుచున్నది (యోహాను 3:16). ఆయనలో, ఆయన ద్వారా దేవుడు మనకు వ్యక్తపరచబడెను (హెబ్రి.1:1,2). ఆయన దేవుని వాద్యమై ఉన్నాడు (యోహాను 1:1). ఆయన అదృశ్యదేవుని స్వరూపి (కొలొస్సి 1:15). ఆయన సృజింపబదిన వాడు కాదు లేదా జన్మించబడినవాడు కాదు; దీనిప్రకారముగా ఆయన "కుమారుడు" కాదు. ఆయన నిత్యత్వము కలిగిన వాడు. ఆయన దేవుడు (యోహాను 1:1). ఈయన మాత్రమే దేవునికిని, మనుష్యునికిని మధ్యవర్తిమై యున్నాడు (1తిమోతి 2:5). మనకు దేవుని గూర్చి ఏదైతే తెలియవలెనో అది క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా మాత్రమే తెలియును, ఎందుకంటే దైవమూర్తిత్వము ఆయన శరీరమందు వ్యక్తమగుచున్నది (కొలోస్సి 2:9). ఆయన సృష్టికర్త, విశ్వపాలకుడు ఎందుకనగా ఆయనలో దైవం వ్యక్తమగుచున్నది (కొలొస్సి 1:16; హెబ్రి 1:3). ఈయన కూడ ఒక దేవుడు కాదు కాని ఈయన మాత్రమే దేవుడు. దేవునితో ఉన్నవాడు (యోహాను 17:22). ఆయనే  త్రిత్వము: తండ్రి దేవుడు, కుమారదేవుడు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు.  కాని మూడు దేవుళ్ళు కాదు. ఆయన ఒక్కడే, ముగ్గురూ ఒక్క దేవుడే. అది ఎలాగు అగును? అలాగునే ఎందుకంటే దేవుడు సత్యము, దేవుడు సంతోషము, దేవుడు ప్రేమ. సత్యస్వరూపములో దేవుడు ఎరిగినవాడు, ఙ్ఞానవిషయము, మరియు సర్వఙ్ఞాన ఆత్మ యొక్క ఐక్యతయై యున్నాడు. ప్రేమస్వరూపిగా ఆయన ప్రేమికుడు, ప్రియుడు, మరియు ప్రేమ ఆత్మ. సంతోషముగా, ఆయన సంతోషికుడు, సంతోషవిషయము, మరియు సంతోషాత్మ. యేసు అబ్రహాము కంటే ముందు ఉనికిని కలిగి ఉండెను (యోహాను 8:58). యేసు ఈ విశ్వము కంటే ముందు ఉనికిని  కలిగి ఉండెను (యోహాను 1:1,2). ఆయన [యేసు] నిత్యుడు.
అన్ని క్రీస్తు కొరకు, క్రీస్తుద్వారా చేయబడెను (కొలొస్సి 1:16). ఆయన దేవుని యొక్క ఉన్నతమైనవాడునై, సర్వ సృష్తికి ఆది సంభూతుడై యున్నాడు (కొలొస్సి 1:15).
ఆయన సృష్తికి విడుదల కలుగచేయువాడు, లోక రక్షకుడు ఇందు నిమిత్తమునై ఆయన మానవ అవతరియాయెను (యోహాను 1:14). దేవుని నీతి నెరవేర్చుటకు మన పాపపరిహారార్థమై బాదింపబడెను (హెబ్రి 2:9-18). మరణము నుండి తిరిగిలేచి క్రొత్తసృష్తికి కర్తమాయెను, కాబట్టి ఆయనను ఎవరయితే వెనయ విశ్వాసములతో అంగీకరించుదురో వారు దేవుని రాజ్యములో పాలి భాగస్థులగుదురు. ఆయన తిరిగి వచ్చి చివరిదినమున బ్రతికి ఉన్నవారికి, చనిపోయిన వారికి తప్పక తీర్పు తీర్చును (2తిమోతి 4:1).

పరిశుద్ధాత్ముడు

పరిశుద్ధాత్ముడు విభిన్న నామములతో పరిశుద్ధగ్రంథములో పిలువబడెను. "దేవుని ఆత్మ" (ఆది 1:2), "సత్యస్వరూపియగు ఆత్మ" (యోహాను 14:16), "పరిశుద్ధాత్ముడు" (లూకా 11:13), "పరిశుద్ధమయిన ఆత్మ" (రోమా 1:4), మరియు "ఆదరణకర్త" (యోహాను 14:26). పరిశుద్ధాత్మడు సమస్తమునకు సృష్టికర్త మరియు జీవముదయచేయువాడు (యోబు 33:4; కీర్తన 104:30). లేఖనములు వ్రాయుటకు ఆయన ప్రేరేపితము చేసినవాడు (2పేతురు 1:21). ఈయన ద్వారా దేవుడు అద్భుత వరములను ఆయన ఆత్మీయ విషయములను అర్ఠముచేసుకొను సామర్థ్యము దయచేయువాడు (యోబు 32:8; యెష 11:2). ఆయన దేవుని పరిచారకులను అభిషేకించి వారిని పరిశుద్ధపరచి, పరిచర్యయందు జతపరిచెను (అపో 10:38; 1యోహాను 2:27). ఆయన యేసుక్రీస్తు యొక్క గొప్ప సాక్షి. మరియు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఓప్పింపకొనజేయును (యోహాను 15:26; 16:8). ఆయన శిష్యులలో నివాసము చేసి వారికి శక్తిని అనుగ్రహించి యేసుక్రీస్తు సాక్షులనుగా ప్రపంచ వ్యాప్తముగా వాడుకొనెను (అపో 1:8).

సృష్టి

దేవుడు ఆరు దినములలో విశ్వమంతటిని సృష్టించెనని పరిశుద్ధగ్రంథము మనకు తెలియచేయుచున్నది (ఆది 1,2; నిర్గమా 20:11). దృష్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మించబడలేదు (హెబ్రి 11:3); ఇంకో మాటలో చెప్పాలి అంటే శూన్యము నుండి దేవుడు తన అవసరతను బట్టి ఈ విశ్వమును సృష్టించలేదు కాని ఆయన స్వచిత్తమును బట్టి సృష్టించెను (ప్రకటన 4:11). వెలుగును, అంధకారమును దేవుడే కలుగచేసెను (యోష 45:7; ఆది 1:3). స్థలమును, సమయమును దేవుడు కలుగచేసెను (కీర్తన 90:2 "పుట్టించెను" అను దానికి హెబ్రూ పదము హ్యూల్ (chul) అనగ "సృజించెను" లేదా "త్రిప్పెను" ). దేవుడు విశ్వమును యేసుక్రీస్తు కొరకు సృష్టించెను. ఆయన అన్నింటి కంటే ఉన్నతమైనవాడు (కొలొస్సి 1:16-18; ఎఫెసి 1:10).

దేవదూతలు

దేవదూతలు అంతంలేని వారు మరియు ఆకాశజీవులు. దేవుడు వీటిని సృష్టించెను (ప్రకట 19:10; 20:8-9; కొలొస్సి 2:18; లూకా 20:34-36). వారు "పరిచారకులు"గా పిలువబడిరి (హెబ్రీ 1:14). వారు లింగ సంబంధులు కారు మరియు అనేకులు (లూకా 20:34-35; దాని 7:10; హెబ్రీ 12:22). విభిన్న రకముల దేవదూతలు కలరు. కెరుబులు ఎదేను తోటలో దేవుని సన్నిధి నందు నియమింపబడిరి (ఆది 3:24; నిర్గమ 25:22; యెహెజే 28:13-14). సిరాపులు "మండుచుండువారు" వీరు దేవునిని ఆరధించువారు (యెషయా 6:2-3). ఇద్దరు ప్రధాన దూతలు మిఖాయేలు - యుద్ధము చేయు దూతలకు అధిపతి (యూదా 1:9; ప్రకటన 12:7), గాబ్రియేలు - వారాహరుడు (లూకా 1:19; దాని 8:16; 9:21). దేవుని సన్నిధిలో వారి స్థానములను బట్టి వారు ఏర్పరచబడిన దేవదూతలని తెలియుచున్నది (1 తిమోతి 5:21). వీరు దేవుని దూతలు, సాతానుతో కలిసి ఎదురుతిరిగిన వారు  కాదు (సాతాను పడిపోవక మునుపు కెరుబుగా అభిషేకించబడిన వాడు). దేవదూతలు ఙ్ఞానము కలిగిన వారు (2స్ముయేలు 14:17; 1పేతురు 1:12). దేవుని ఆఙ్ఞకు లోబడువారు (కీర్త 103:20). వీరు పరిశుద్ధులు (ప్రకటన 14:10). వీరు దేవుని సేవకులు. ఆయన ఆఙ్ఞప్రకారము పరిచర్యచేయు వారు (హెబ్రీ 1:14; కీర్త 103:20).

దయ్యములు

దయ్యములు దేవదూతలే. వేరు లూసిఫర్తో కలిసి దేవునికి వ్యతిరేఖముగా తిరుగు బాటు చేసిన వారు. లూసిఫర్ ను సాతాను అని కూడా పిలువబడ్డాడు (అర్థము "శత్రువు"), షుటస్ర్పము, శోధకుడు, దుష్టుడు, ఈ లోఖాధికారి, ఈయుగ సంబంధమయిన దేవత, నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు (యెష 14:12-15; యెహె 28:12-19; యోహాను 12:31; 2కొరిం 4:4; మత్తయి 4:3; 1యోహాను 5:19; యోహాను 8:44). అదే విధముగా ఈదుష్టాత్మలను "తమ ప్రధానత్వమును నిలుపుకొనని దూతలుగా ఎంచబడెను (యూదా 6). వీరు పడిపోయిన దేవదూతలు. వీరు దేవుని పరిచర్యను అభ్యంతర పరుచువారు (1థెస్స 2:18), దేశములను మోసపుచ్చువారు (ప్రకట 20:7-8), గ్ర్వామ్ధుడ్యిన అపవాధి (1తిమొతి 3:6), అవిధేయులైన వారిని ప్రేరేపిమ్చు శక్తి కలిగిన వారు (ఎఫె 2:2), కఠిన స్వభావము కలినినవి (1పేతురు 5:8), అపాయము కలుగచేయువారు (యోబు 2:4), నానా ప్రఖరములుగా మానవులను పీడించువారు (అపో 10:38; మార్కు 9:25). వీరు అవిశ్వాసుల శరీరములను ఆవరించువారు (మత్తయి 8:16), మనుష్యునిలోనికి ప్రవేశించు సామర్థ్యముగలవారు (లూకా 22:3), హృదయములను ప్రేరేపించువారు (అపో 5:3), పశువులను కూడా ఆవరించువారు (లూకా 8:33).
విశ్వాసులు దయ్యములు పట్టిపీడింపబడరు, వారి దేహము పరిశుద్ధాత్మ ఆలయము. దయ్యములదు స్థలముండదు (1కొరిం 6:19; 10:21).
దయ్యములు దేవునిని నమ్మి వణుకుచున్నవి (యాకోబు 2:19). సాతాను, దయ్యములు దేవుని తీర్పుకై వేచియున్నవి (మత్తయి 8:29; ప్రకట 20:10). యేసుక్రీస్తు నంద్య్ విశ్వాసము కలిగిపిలువబడిన వారు దేవునికి విధేయులై అపవాధిని ఎదురించుదురు (యాకోబు 4:7). విశ్వాసుల సూచన్లు ఏవిటంతే వారు దయ్యములను వెల్లగొట్టుదురు (మార్కు 16:17).

దయ్యములను వెడలిగొట్టుట


  1. క్రీస్తు యిచ్చిన అధికారముతో విశ్వసులు దయాములను వెల్లగట్టుదురు (మత్తయి 10:1,8; మార్కు 16:17). ఈ శక్తికి మూల కారణము క్రీస్తు మాత్రమే.
  2. క్రీస్తు దేవుని ఆత్మవలన వాటిని వెల్లగొట్టెను (మత్తయి 12:28), కాబట్టి విశ్అసి ఆత్మచే నింపబడిన నడ్వడికను కలిగి ఉండవలెను (గలతి 5:25).
  3. ప్రార్థన, ఉపవాసము దేవునికి సంపూర్తి సమర్పణ ప్రాముఖ్యము (మార్కు 9:29; యాకోబు 4:7).
  4. విశ్వాసులు ఆత్మలవివేచన వరమును వెదకు వైయుండవలెను (1కొరిం 12:10).
  5. దయ్యముతో మాట్లాడ్రాదు (మార్కు 1:24). వారు మోసముచేయువారు.
  6. విశ్వాసులు వాటిని యేసు నామములో వెల్లగొట్టవలెను (అపో 16:18)
  7. దయ్యములను వెల్లగొట్టునపుడు కళ్ళుమూయరాదు: నీవు ఆఙ్ఞాపించుచున్నావు, ప్రార్థన చేయడం లేదు; దయ్యములు కొన్ని పర్యాయములు శరీర్కముగా గాయపర్చును (మత్త 17:15; అపో 19:15-16).
  8. దేవుని యందు విశ్వాసము, ఆయన వాక్యము క్రీస్తుయొక్క శక్తి, మరియు పరిశుద్ధాత్మయందు బలహీన పర్చడనికి విశ్వాసి సాతానుకు ఏమాత్రము అవకాశమునివ్వరాదు. అనుమానము సాతానుయొక్క ఆయుధం (ఆది 3:1; మత్తయి 4:3-10).
  9. దయ్యములను వెడలిగొట్తునపుడు దైవసేవకుల మధ్య క్రమము పద్ధతి ప్రకారము కలిగి ఉండాలి, ఒక సేవకుడు అధికార సేవ వహిస్తున్నగా మిగతా వారు ప్రార్థనలో ఉండలి (1కొరి 14:33).
  10. మంత్రములతో చేయబడిన తామత్తు, దారము మొదలగునవి దయ్యములను వెడలిగొట్టకు మునుపు తీసివేయవలెను. ఇటువంటివి దెయ్యాలకు అవసరము ఇచ్చెను (అపో 19:19).
  11. తిరిగి వదిలిన అపవాది రాకుండునట్లు విడుదల కలిగిన వారిని తప్పక ఒప్పుకొనుటకు, మారుమనస్సు, విశ్వాసమునకు మరియు పరిశుద్ధాత్మ నింపబడుటకు నడిపించవలెను (మత్తయి 12:44-45). పరిశుద్ధ జేవితము మరియు దేవుని చిత్తప్రకారము నడుచుకొనుట ప్రాముఖ్యము (1యోహాను 5:18).

మనుష్యుడు

దేవుడు మనుష్యున్ని ఆరవదినమున సృజించెను. ఆయన తన స్వరూపమున స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను (కీర్తన 8:5; ఆది 1:28). దేవుడు మానవున్ని వ్యక్తిగాను, శరీరిగాను, ఆత్మనుగాను సృజించెను. కాబట్టి మనుష్యుడు శరీర, ప్రాణ, ఆత్మను కలిగిన వాడు (ఆది 2:7; యోబు 32:8; ప్రసంగి 11:15; 12:7; 1 థెస్సలో 5:23). మొదటి మానవుడయ్న ఆదాము పాపము చేసేను. దీనిని బట్టి మారణములో ప్రవేశించెను(రోమా 5:12). ఆదామునందు అందరు పాపము చేసిరని బోదనైయున్నది. కాబట్టి మరణము అందరికి సంప్రాప్తించెను (రోమా 5:12). ఈ మరణము మూడు స్వభావములను కలిగియున్నది. ఆత్మయ మరణము (దేవుని నుండి వేరుచేయబడుట మరియు దేవునికి శత్రువగుట), భౌతిక మరణము (ఆత్మ శరీరమునుండి వేరుచేయబడుట), రెండవ మరణము (నరకము నందు శిక్ష) (ఎఫెసి 2:1; కొలొస్సి 1:21; రోమా 5:10; ప్రకటన 21:8). పాపములవలన మానవునికి మరణము ప్రాప్తమాయెను.
బైబిలు బోధన ఏమిటంటే "రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు" (1కొరిం 15:50). కాని యేసు క్రీస్తును తన ప్రభువుగా అంగీకరించు వారు రక్శించబడుదురు. రక్షమార్గము ద్వారానే పాత సృష్ఠి శిక్షనుండి తప్పించబడుదురు. ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారా రాబోవు దేవుని రాజ్య వారసత్వాన్ని కలిగిరి. మిగతావారు ఈ లోక దేవతకు అనగా దయ్యపు సంబంధితులు (2కొరిం 4:4; ఎఫెసి 2:2; యోహాను 5:19).

రక్షణ

యేసు క్రీస్తు నందు విశ్వాసము గలవారు రక్షింపబడుదురని సువార్త ప్రకటించుచుంన్నది. దేవుడు తన కుమారుదయిన యేసు క్రీస్తును ఈలోకమునకు బలియాగపు గొఱ్ఱెపిల్లగా, ఆదిలోక పరిగారార్థముగా పంపెను (యోహాను 1:29). యేసు క్రీస్తు యొక్క దేహము బలియాగపు దేహము. అది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినదై ప్రత్యేకింపబడెను (లూకా 1:35; హెబ్రి 10:5). పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు యొక్క వేదనను బయలుపర్చెను. ఆయన దేహము మన పాపముల నిమిత్తము వేదననొందెను. ఇది పాత నిబంధన ప్రవక్తల ద్వారా వెల్లడి చేయబడెను (1 పేతురు 1:10,11). యేసు క్రీస్తు తన బలియాగపు మరణము ద్వారా మానవునికిని దేవునిమి వధ్య మధ్యవర్తియాయెను. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనెను (హెబ్రి 9:14). ఆయన దేవుని సన్నిధానమునకు మార్గము తెరచెను (హెబ్రి 10:19-20). ఆయన బలియాగము మరియు పునరుర్థానము ద్వారా, యేసు క్రీస్తు, దేవునికి మానవునికి సత్-సంబంధమును ఏర్పరచెను (రోమా 5:10; హెబ్రి 1:3).
ఈ ర్క్షణ ఆహ్వానమును ఖాతరు చేయని వారు శిక్షింపబడుదురు. మరియు వారు ప్రభువు సన్నిధి నుండి మరియు ఆయన మహిమగల శక్తి నుండి నిత్యనాశన శిక్షకు పాత్రులగుదురు (2 థెస్స1:9). ఎవరైతే యేసు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించుదురో వారు అంధకారమునుండి తప్పీంచబడి, యేసు క్రీస్తు రాజ్యములో ప్రవేశించుదురు (కొలొస్సి 1:13), వారు పుత్ర వారసత్వము కలిగి యేసు క్రీస్తుతో సహపాలివారగుదురు (యోహాను 1:12; రోమా 8:17).
రక్షణ ఆశీర్వాదములు
  1. పాప క్షమాపణ (ఎఫెసి 1:7)
  2. నీతి మంతులుగా తీర్చబడుదురు (రోమా 4:25)
  3. నిత్య జీవము (యోహాను 3:16)
  4. పరలోక పౌరస్థితి కలిగి యుందురు (ఫిలిప్పి 3:20)
  5. నిత్యమైన స్వాస్థ్యము కలిగి యుందురు (హెబ్రి 9:15)
  6. దయ్యములపై, రోగములపై అధికారమును కలిగియుందురు (లూకా 10:19)
  7. ఆత్మ ఫలములను కలిగియుందురు (గలతీ 5:22-23)
  8. మహిమాన్వితమయిన పునరుర్థానము (1కొరిం 15:51-54)

సంఘము

యేసు క్రీస్తు యొక్క శిశ్యుల సహవాసమును సంఘమందురు. ఇది గొఱ్ఱె పిల్ల యొక్క వదువుగా(ప్రకట 21:9; ఎఫెసి 5:25-27; ప్రకట 19:7), క్రీస్తు దేహము (1కొరింథి 12:27), దేవుని మందిరము (1పేతురు 2:5,6; ఎఫెసి 2:21-22; 1కొరింథి 3:16-17) పేర్కొనబడినది. సంఘము అపోస్తులుల మరియు ప్రవక్తల పునాదిపై కట్టబడినది. యేసు క్రీస్తే దేనికి మూలరాయి (ఎఫెసి 2:20). కాబట్టి అపోస్తులుల బోధ సంఘ భవిష్యత్తు ఉద్ధారణకైనవి (అపో 2:42; 15:32). సంఘము ప్రియ సహవాస గుంపు. కాబట్టి సమాజముగా కూడుకొనకుండ ఉండరాదని ఆఙాపించబడెను (హెబ్రి 10:25). సంఘము అనునది దేవుని ఇల్లు, ఆయన కుటుంబము; కాబట్టి ఐక్యత, తోడుపాటు, మరియు ప్రోత్సాహనము, విస్తరించునదై యుండవలెను (ఎఫెసి 2:19; 1కొరింథి 1:10; యోహాను 13:35; గలతీ 6:1-2) సంఘము సార్వత్రికము, స్థానికము.
ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులులను, ప్రవక్తలను, సువార్తికులను, భోధకులను మరియు కాపరులను సంఘ సంరక్షణాభివృద్ధికై నియమించెను (ఎఫెసి 4:11-12). పరిశుద్ధాత్ముడు తన వరములను వ్యక్తిగతముగా సంఘాభివృద్ధికై అనుగ్రహించెను (1 కొరింథి 12). సంఘము ప్రతిదేశమునకు యేసు క్రీస్తు సువార్తను అందించుటకు పిలువబడెను, వారెలోనుడి శిష్యులనుగా చేయుటకు మరియు యేసు క్రీస్తు యొక్క భోదలను భోధించుటకు సంఘము పిలువబడెను (మత్తయి 28:19-20). ఈ సుసమావ్హారము నందు ప్రభువు యొక్క పని మరియు వాక్యమును స్థిరపరుచుటకు అద్భుతములను, సూచకక్రియలను జతపర్చెను (మార్కు 16:20; హెబ్రి 2:4).
సంఘమునకు రెండు శాసనములు యివ్వబడెను: నీటి వలన బాప్తిస్మము (మత్త సంఘమునకు రెండు శాసనములు యివ్వబడెను (మత్త 28:19), మరియు ప్రభురాత్రి భోజన సంస్కారం (1 కొరింథి 11:23-29).
యేసు క్రీస్తు తన సంఘము కొరకు తిరిగివచ్చును. అయితే క్రీస్తు నందు నిద్రించినవారు మొదట లేతురు, స్జీవముగా ఉన్నవారు ఆయనతో కూడా మేఘములో యుగముగములు వరకు ఉండుటకు ఎత్తబడుదురు (1థెస్స 4:16-17).

పరిశుద్ధ గ్రంథము

యేసు క్రీస్తు నందు విశ్వాసమూలముగా కలుగు రక్షణ కొరకు దేవుని ఉపదేశములుగా ఇవ్వబడిన పుస్తకము పరిశుద్ధ గ్రంథము (2తిమోతి 3:15). దైవజన పరిశుద్ధులచే పరిశుద్ధాత్మ ప్రవచన ప్రేరేపణచే వ్రాయబడినది (హెబ్రి 1:1; 2పేతురు 1:20,21). కాబట్టి ఇది దైవావేశము వలన కలిగిన వాక్కు అని అనబడెను (2తిమో 3:16). లోకపరముగా పరిశుద్ధ గ్రంథము అర్థమగునది కాదు. రక్షణ ఉపదేశము పర్శుద్ధాత్మ వలన కలుగునది (1కొరింథి 2:10-16). కాబట్టి ప్రకృతి సంబంధిమయిన వ్యక్తి ఆత్మ సంబంధమయిన విషయములను అర్థము చేసుకొన లేడు. పరిశుద్ధ గ్రన్థము మార్పులేనెది మానవుని నిమిత్తము దైవిక ఉపదేశము కలిగి యున్నది (ప్రకటన 22:6).
పరిశుద్ధ లేఖనములు యేసు క్రీస్తు గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి (యోహాను 5:29; గలతి 3:8). విశ్వాసులు లేఖనములను చదువుటకు, ధ్యానించుటకు పిలువబడిరి (కీర్తన 1:2). పరిశుద్ధ గ్రంథము వకువ్యాఖనము, జతపర్చుటను, దాని నుండి త్రిప్పివేయుటను ఖండించు చున్నది (2 పేతురు 3:16; ప్రకటన 22:18-19).

తీర్పు

దేవుని యొదుటకు ప్రతివారు తీర్పుతీర్చబడుటకు ప్రపంచ చివరి దినమున తేబదురు. యేసు ముందుగానే చివరిదినము గూర్చిన సూచనలు ఇచ్చెను. అవి విశ్వసములో పడెపోవువారు, అబద్ధ ప్రవక్తలు, ప్రపంచమును ఆధినములో ఉంచుకొను రాబోవు అబద్ధ క్రీస్తు, మరియు యుద్ధములు, భూకంపములు, క్రువులు, దుష్ఠకార్యముల పెరుగుదల, దుర్భోధల మరియు అనేక సూచనలు (మత్తయి 24) జరుగును. వీటన్నింటి తరువాత మనుష్యకుమారుడు మహిమప్రభావముతో ఆకశమునందు దూతలతో అగుపించును (2థెస్స 1:7) . ఆయన రెండవ మారు తన ప్రజల రక్షణార్థమై మరియు లోకమునకు తీర్పు తీర్చుటకు కనిపించును (హెబ్రి 9:28). క్రీస్తు నందు నిద్రించిన వారు మొదట లేతురు, తదుపరి సజీవులైన ఆయన శిష్యగణం ప్రభువుతో యుగయుగములుండుటకు ఎత్తబడుదురు (1థెస్స 4:16-17). సాతాను వాని అనుచరగణం నరకమునందు శిక్షింపబడుదురు (మత్త 25:4; ప్రకటన 20:10). జీవ గ్రంథమందు పేరు వ్రాయబడ్ని వారు అగ్నిగుండము నందు పడద్రోయబడుదురు (ప్రకటన 20:15) ఎందుకంటే కార్యములను బట్టి వారికి తీర్పు తీర్చబడును (రోమా 2:5-6; యూదా 15).
© డామినిక్ మార్బానియంగ్, 2009, భాషాంతరము: బాలరాజు

No comments :

Post a Comment